రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ లో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు శుక్రవారం ఉదయం పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో సచివాలయం ఉద్యోగులచే తెల్లవారుజామునే పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.