నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టులో పిటిషన్ బుధవారం దాఖలు చేశారు. మచిలీపట్నంలో అధికారులు అర్హులకు పట్టాలిచ్చారని, తన కుమారుడికి గానీ, తనకు గానీ ప్రమేయం లేదని నాని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.