మచిలీపట్నం: ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు

59చూసినవారు
మచిలీపట్నం: ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు
అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్బంగా మచిలీపట్నం సబ్ డివిజన్ బైక్ ర్యాలీలకు కానీ, డీజే సౌండ్ బాక్స్ ల వినియోగానికి గాని, ఫ్లెక్సీలకు గానీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని డీఎస్పీ రాజా పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని డ్రోన్ కెమెరాలతో నిషితంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్