కేసులకు భయపడి పారిపోయే వ్యక్తిని కాదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నకిలీ పట్టాల కేసులో న్యాయ విచారణకు తాను సిద్ధమని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. ఈ కేసులో నానిని అరెస్ట్ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో గురువారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. తానెప్పుడూ తప్పు చేయలేదని, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని నాని స్పష్టం చేశారు. కావాలని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారన్నారు.