మచిలీపట్నం: 'ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు'

1చూసినవారు
మచిలీపట్నం: 'ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు'
రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, మచిలీపట్నం నియోజకవర్గ బీసీవై పార్టీ నేత కోన నాగార్జున శనివారం గోడౌన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. మచిలీపట్నంలో కందులు బాజ్జీ అనే వ్యక్తికి చెందిన గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచారని వారు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితమే అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించే వరకు నిరసన కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్