మాట మీద నిలబడే ప్రభుత్వం మాది అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా, 10: 30 గంటలకు 80 శాతం వరకు పింఛన్లు పంపిణీ జరిగిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం జులై నుంచి పెన్షన్ రూ. 4000 పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం మండలంలో 75% పింఛన్ల పంపిణీ జరిగిందన్నారు.