మచిలీపట్నం వైసీపీ కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ముస్లిం మైనార్టీ కార్యకర్తలు అభిమానులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారని తెలిపారు. జగన్ ముస్లింలకు ఎప్పుడు అండగా ఉన్నారని, మా సమస్యలపై పోరాడే మాజీ ముఖ్యమంత్రికి మేము అండగా ఉంటామని తెలిపారు.