మచిలీపట్నం: పాక్ పిరికిపంద చర్యలకు తగిన గుణపాఠం చెప్పారు

81చూసినవారు
భారత సైన్యం పాక్ పిరికిపంద చర్యలకు సరైన గుణపాఠం చెప్పారని డీసీఎంఎస్ చైర్మన్, జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ బండి రామకృష్ణ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల శుక్రవారం ఉదయం జాతీయ జెండాలు చేపట్టి కూటమి నేతలు భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, కాశ్మీర్ లో జరిగిన దాడిలో అమాయకులు బలి అయ్యారన్నారు. ఇందుకు భారత సైన్యం పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పిందన్నారు.

సంబంధిత పోస్ట్