మచిలీపట్నం పాండురంగ స్వామి గుడిలో బుధవారం త్రిముఖ సినిమా హీరో యోగేష్ చేతుల మీదుగా "పరమార్థ" ఇండిపెండెంట్ మూవీ 2వ టీజర్ ను లాంచ్ చేశారు. "త్రిముఖ" సినిమా నటులయిన స్మైల్ మోహన్, హర్ష అల్లడ, ఉదయ్ కుమార్ సుతారి, దుర్గ, రాకేష్, దుర్గేష్, వంశీ తదితరులు హాజరు అయ్యారు. పరమార్థ టీజర్ చాలా బాగుందని త్రిముఖ హీరో యోగేష్ పరమార్థ టీమ్, దర్శకుడు జితేంద్ర, నిర్మాత కాళేశ్వరరావును కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.