మచిలీపట్నం: మంత్రి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పేర్ని కిట్టు

52చూసినవారు
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని తనయుడు, నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్   పేర్ని కిట్టు స్పందించారు. ఆదివారం మచిలీపట్నంలో మాట్లాడుతూ 2006లో బందరు పోర్టును గోగులేరుకు తరలించేందుకు పేర్ని నాని సంతకం పెట్టారని కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలను నిరూపిస్తే క్షమాపణలు చెప్పేందుకు తాము సిద్ధమన్నారు. పోర్టు గురించి ఎన్నికల ముందు మంత్రి ఏమి మాట్లాడారో గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్