మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అరెస్ట్ చేసిన నలుగురిని ఐదు రోజుల కస్టడీ కోరుతూ మచిలీపట్నం జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏ2 మానస్‌తేజ, ఏ3 కోటిరెడ్డి, ఏ4 మంగారావు, ఏ5 బాలాంజనేయులు ప్రస్తుతం జిల్లా జైలులో ఉన్నారు. కాగా ఏ1గా నాని సతీమణి జయసుధ ఉన్నారు.