ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తత లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా పోలీసు శాఖ ఓ వీడియో విడుదల చేసింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ స్పందించవద్దని, మీ ఫోన్ నెంబర్ పై కేసులు ఉన్నాయని, వాటిని తొలగించాలంటే డబ్బులు కట్టాలని చెప్పే వారి మాటలు నమ్మొద్దు సైబర్ నేరానికి గురికావద్దని సూచించారు.