మచిలీపట్నం: పోలీసు విశ్రాంతి భవనం ప్రారంభం

75చూసినవారు
కృష్ణాజిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనాన్ని మచిలీపట్నం సుకర్లాబాదులో సోమవారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశారి ప్రారంభించారు. ఎంపీ నిధులతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. అనేక మంది సహకారం అందించడంతో ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ గంగాధర్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్