రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్ వద్ద వైసీపీ ఆందోళన చేపట్టింది. వైసీపీ నాయకులు, మహిళా నేతలు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. 'సేవ్ విమెన్ - సేవ్ ఆంధ్రా' అంటూ నినాదాలు చేస్తూ, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.