అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మెడికల్ సూపర్నెంట్ ఆశలత ఆధ్వర్యంలో మచిలీపట్నం పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ సిబ్బంది క్యాన్సర్ వ్యాధిపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేశారు. ప్రతిరోగి ప్రతి ప్రాణం నిలవాలి అనే నినాదం తో ఈ ర్యాలీ కోనేరు సెంటర్ నుండి రాజా సెంటర్ నుంచి జనరల్ హాస్పిటల్ వరకు నిర్వహించారు.