కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు పరంపర కొనసాగుతుంది. మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఆదేశాల మేరకు రహదారికి అడ్డుగా ఉన్న ఆకమణలు జెసిబితో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం శివారు కాలేఖాన్ పేటలో రహదారి వెంబడి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించారు. గత 35 రోజులుగా ఈ ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.