మచిలీపట్నం - బీదర్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేవలం రెండే రెండు జనరల్ బోగీలు మాత్రమే ఉండటంతో ప్రయాణీకులకు కూర్చోవడానికి సీట్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. సోమవారం రాత్రి నరకయాతన అనుభవించారు. నిలబడటానికి కూడా జాగా ఉండని పరిస్థితి నెలకొందన్నారు. అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి విజ్ఞప్తి చేస్తున్నారు.