రహదారి భద్రత మనందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను నివారించడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ప్రమాదం జరిగాక బాధపడే కన్నా ప్రమాదం జరగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే నష్టపోయేది మీరు మాత్రమే కాదని మీ నిర్లక్ష్య వైఖరి వల్ల మరో కుటుంబం రోడ్డుపై పడుతుందన్నారు.