మచిలీపట్నంలో జరిగిన పోలీసు పరుగులు పందెంలో అస్వస్థకు గురై మరణించిన చంద్రశేఖర్ భౌతికకాయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దారావత్ చంద్రశేఖర్ మరణం దిగ్భాంతిని కలిగించిందన్నారు. కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరపున 25వేల రూపాయలు నగదు, గిరిజన సంక్షేమ శాఖ తరపున 25వేల రూపాయలు నగదు మొత్తం 50000 ఎక్స్గ్రేషియాను కుటుంబ సభ్యులకి అందించారు.