మచిలీపట్నంలోని డిఎంఎస్ఎస్విహెచ్ ఇంజినీరింగ్ కాలేజ్, సృజన అకాడమీ ఆఫ్ టెక్నాలజీలో విలీనం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం ఉదయం పాము కలకలం సృష్టించింది. విద్యార్థినిలు పామును చూసి భయభ్రాంతులతో కేకలు వేయగా ప్రాంగణంలోని వారు హడావిడి పడ్డారు. అక్కడే ఉన్న సిబ్బంది పాముని చంపడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.