ప్రస్తుత సమాజంలో యువతకు సోషల్ మీడియా, డ్రగ్స్ వినియోగం రెండూ ప్రమాదకరంగా మారాయని కలెక్టర్ డీకే. బాలాజీ అన్నారు. మచిలీపట్నం హిందూ కాలేజ్ లో జరుగుతున్న యువకెరటాలు ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. అవసరం మేరకే సోషల్ మీడియాను వినియోగించాలని, ఎక్కువ సమయాన్ని కేటాయించి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన అన్నారు. యువత డ్రగ్స్ జోలికి పోవద్దని కలెక్టర్ సూచించారు.