ఈనెల 6వ తారీఖున జరిగిన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోలీసు వెల్ఫేర్ కళ్యాణ మండపంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్ని దానాలలో కెల్ల అన్నదానమునకు అధిక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు.