మచిలీపట్నం: కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు

77చూసినవారు
మచిలీపట్నం: కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కృష్ణా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో అట్రాసిటీ నివారణ చట్టం, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును ఆయన కమిటీ సభ్యులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్