మచిలీపట్నం మండలంలో గల తాళ్ళపాళెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున గస్తీ నిర్వహించారు. కాకినాడ జిల్లా నుండి ప్రయాణిస్తున్న ఆటోలో ఇద్దరు వ్యక్తులు వద్ద నుండి 70 లీటర్ల నాటు సారాను రవాణా చేస్తుండగా, స్వాధీన పరుచుకున్నారు. ఇద్దరిని, ఆటోను, సారాను మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ నందు అప్పగించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వరమ్మ ఎస్సై జె. ఎలియాజర్ పాల్గొన్నారు.