జిల్లాలో పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని తన చాంబర్ లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పన్ను ఎగవేతను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. జిల్లాలో పలువురు వ్యాపారులు పన్ను ఎగవేతకు అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారని తెలిపారు. ఆ విషయాలను గమనించాలని తెలిపారు.