రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ, అభివృద్ధిని ఓర్చుకోలేక బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బందరు అభివృద్ధి చూసి పేర్ని నానికి జీర్ణించుకోవడం లేకపోతున్నాడన్నారు.