మచిలీపట్నం: క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ

72చూసినవారు
మచిలీపట్నం: క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ
కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్ధూపం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీ లో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సుకై అహార్నిశలు పోరాడి అమరులైన పోలీసుల త్యాగ నిరతికి ఇవే మా జోహార్లు అంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్