ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడమే లక్ష్యంగా కొల్లు ఫౌండేషన్ పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, జనసేన ఇన్ ఛార్జి బండి రామకృష్ణతో కలిసి మచిలీపట్నం కోనేరు సెంటర్లో అంబలి పంపిణీ శనివారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వేసవిలో పాదచారుల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.