మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజలకు చేసే సేవలు ఎనలేనివని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బుడమేరు వరద బాధితులకు సేవలందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు కృష్ణా జిల్లా కలెక్టర్ సేవ ప్రశంసా పత్రములు అందజేశారు. వరద బాధితులకు వివిధ రూపాలలో సేవలు అందించినందుకు సభ్యులను ఘనంగా సత్కరించారు.