మచిలీపట్నం నగరంలో ఆదివారం రాత్రి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ ఈదురు గాలులు ఒక్కసారిగా రావటంతో రహదారి వెంట ఉన్న దుమ్ము గాలికి వచ్చి ప్రజల మీదకు పడింది. దీంతో విద్యుత్ శాఖ అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఈదురు గాలులతో ప్రజలు భయపడి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. మచిలీపట్నం డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో భారీగా ఈదురు గాలులు వీచాయి.