మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి తరకటూరు సమీపంలో బైకును కారు బుధవారం ఢీకొట్టింది. మచిలీపట్నం వైపు వస్తున్న బైకును వెనుక నుండి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో చెల్లాచెదురుగా పడిపోయారని స్థానికులు వివరించారు.. క్షతగాత్రులను హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో బాలుడు రిత్విక్ (9), పూర్ణిమ, నాగరాణిలకు గాయాలైనట్లు వివరించారు.. బైకు నడుపుతున్న తిరుమలరావుకు స్వల్ప గాయాలు అయ్యాయి.