మచిలీపట్నం బైపాస్ రోడ్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ బుధవారం రాత్రి నిర్వహించారు. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కృష్ణాజిల్లా వరి ఎక్కువగా పండించే ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తగా వర్షపు నీటికి నిల్వ ఉంచిన ధాన్యం తడవకుండా ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చుటకు రవాణా శాఖ అధికారులు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. 150 లారీలను జిల్లా రవాణా శాఖ అధికారులు సమకూర్చారు.