హెల్మెట్ లేకుండా ప్రయాణం జీవితానికి ప్రమాదమని కృష్ణా జిల్లా ఎస్పీ ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్న వారికి ఎస్పీ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హ్యాండిల్స్ ను సక్రమంగా ఉపయోగించడం ఎంత ముఖ్యమో, అనుకోకుండా ప్రమాదం సంభవించిన ప్రాణాపాయ పరిస్థితికి చేరకుండా ఉండాలంటే తలకు హెల్మెట్ ధరించడం కూడా అంతే ముఖ్యమన్నారు.