ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి సందర్భంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో గురువారం డిఆర్ఓ చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ మొల్ల రామాయణాన్ని రచించిందని తెలిపారు. ఆమె పేరిట తపాలా శాఖ స్టాంప్ కూడా ముద్రించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ ప్రసాద్, శీను నాయక్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.