కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్ నందు స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ అధికారి( ఇంచార్జ్ ) ఫణి ధూర్జటి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వీరాంజనేయ ప్రసాద్, మరియు సంఘ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్రను గురించి గుర్తు చేసుకున్నారు.