మచిలీపట్నం: మొక్కలు నాటే కార్యక్రమానికి సంసిద్ధం కావాలి

71చూసినవారు
మచిలీపట్నం: మొక్కలు నాటే కార్యక్రమానికి సంసిద్ధం కావాలి
జిల్లాలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమానికి సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకం కంటే మించిన గొప్ప పనేదిలేదని స్పష్టం చేశారు. రహదారి మార్గాలు, విద్యాసంస్థలు, కాలువల పక్కన మొక్కలు నాటాలన్నారు.

సంబంధిత పోస్ట్