నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. గురువారం మచిలీపట్నం లోని కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ త్వరలో బందరు పోర్ట్ పనులు పూర్తి అవుతాయని, తద్వారా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వస్తాయని, రవాణా, స్టోరేజి తదితర రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.