మచిలీపట్నం కాలేఖాన్ పేటకు చెందిన నాయుడు సాయిబాబా తన భార్యతో ప్రాణహాని ఉందని ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. సేకరించిన వివరాలు ప్రకారం నాయుడు సాయిబాబా కాలేఖాన్ పేటలో నివాసం ఉంటున్నాడు. భర్త చనిపోతే ఆయన పేరుపై ఉన్న ఆస్తి కూడా మొత్తం తనకే చెల్లుతుందని దురుద్దేశంతో ఆమె భర్త తినే ఆహార పదార్థాలలో విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుందని భర్త ఆరోపించాడు.