మచిలీపట్నం: మహిళలకు రక్షణగా ఉమెన్స్ సేఫ్టీ యాప్

80చూసినవారు
మచిలీపట్నం: మహిళలకు రక్షణగా ఉమెన్స్ సేఫ్టీ యాప్
మహిళలకు, కళాశాల విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ యాప్ రక్షణగా నిలుస్తుందని పోలీసు శక్తి టీం సభ్యులు తెలిపారు. శుక్రవారం మచిలీపట్నంలోని పలు కళాశాలలతో పాటు ప్రైవేటు సంస్థల వద్దకు వెళ్లి ఉమెన్ సేఫ్టీ యాప్ ఎలా అప్ లోడ్ చేసుకోవాలో వివరించారు. ఆపద సమయంలో మహిళలకు, కళాశాల విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. జిల్లా ఎస్పీ గంగాధర్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్