మచిలీపట్నం: ఉమెన్ సేఫ్టీ యాప్ ను ఉపయోగించాలి

53చూసినవారు
మచిలీపట్నం: ఉమెన్ సేఫ్టీ యాప్ ను ఉపయోగించాలి
కళాశాల విద్యార్థినిలు తప్పనిసరిగా ఉమెన్స్ సేఫ్టీ యాప్ ను వినియోగించాలని పోలీస్ శక్తి టీం సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదేశాల మేరకు మచిలీపట్నంలోని పలు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు బుధవారం శక్తి టీం సభ్యులు అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది మహిళల ఫోన్లలో ఉమెన్ సేఫ్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి, దాని ఉపయోగాలను వివరించడంతో పాటు, ప్రాక్టికల్ డెమో కూడా చూపించారు.

సంబంధిత పోస్ట్