కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభా మర్యాదలను పాటించలేదని వైసీపీ సభ్యులు విమర్శించారు. శనివారం మచిలీపట్నంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సభలో వైసీపీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకానొక సమయంలో పోడియం ముందుకు వచ్చి వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు.