వైసీపీ మహిళా విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షురాలిగా శీలం భారతి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. భారతీ మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. భారతి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి పేర్ని నానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.