చట్టసభల ప్రతిష్ఠను దిగజార్చిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మంగళవారం రాత్రి మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని జగన్ చట్టసభల్లో కూర్చోబెట్టి రాజకీయం చేశారని విమర్శించారు. చట్టసభల ప్రతిష్ఠను పెంచేలా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ని సీఎం చంద్రబాబు ఎంపిక చేశారని అన్నారు.