పార్టీ కోసం కష్టపడి పని చేసిన వ్యక్తి నారాయణ: మాజీ మంత్రి

65చూసినవారు
పార్టీ కోసం కష్టపడి పని చేసిన వ్యక్తి నారాయణ: మాజీ మంత్రి
తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన వ్యక్తి కొనకళ్ళ నారాయణ అని మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలో నూతనంగా ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన కొనకళ్ల నారాయణరావును మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్