ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

62చూసినవారు
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
మచిలీపట్నం నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి కొల్లు రవీంద్ర నడుం బిగించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 'ప్రజాదర్భార్' కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రతి శనివారం ఈ ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8-11 గంటల వరకు పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి వినతులు స్వీకరిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్