నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి కృష్ణాలో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో గెజిటను విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 113, కృష్ణాజిల్లాలో 123 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరించి 11న టెండర్లు ఖరారు చేస్తారు.