గాంధీ జయంతి, లాల్ బహుదూర్ జయంతిని పురస్కరించుకొని మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వారి చిత్రపటాలకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బముగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీ గురించి అన్న మాటలు గుర్తు చేసుకున్నారు. గాంధీ స్ఫూర్తితో ప్రజల వద్దకు పాలన, ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రథమ స్థానం ఇవ్వడం జరుగుతుందన్నారు.