ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం పర్యటనకు సంబంధించి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు బుధవారం మచిలీపట్నం రానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధర్ లతో కలిసి నేషనల్ కాలేజీని మంగళవారం సందర్శించి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు