ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి

85చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మచిలీపట్నం వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఎంపీ వల్లభనేని బాలసౌరి కూటమి నేతలకు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారని వివరించారు.

సంబంధిత పోస్ట్