కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బీసీల అభ్యున్నత కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి బీసీలకు సంక్షేమ ఫలాలను అందించిన మహనీయులు సర్దార్ గౌతు లచ్చన్న అని తెలిపారు.